రక్తపోటు సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికి కారణం రోజువారి ఆహారపు అలవాట్లు, శారీరక మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం,
మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు బానిసవ్వడం. వంటి కారణాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు.
ఈరోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారని చాలా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్య వచ్చేవరకు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలను పాటించడం మంచిది.
రక్తపోటు సమస్య నుంచి బయటపడడానికి రోజువారి ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
ముందుగా రక్తపోటు (హై బీపీ) సమస్య ఉన్నవారు రోజువారి ఆహారంలో అధికంగా ఉప్పు కారం మసాలా అధిక కొవ్వు పదార్థాలను తినడం పూర్తిగా తగ్గించుకోవాలి.
భవిష్యత్తులో రక్త పోటు సమస్య నుంచి మీరు బయట పడాలంటే ఇప్పటినుంచి మనం తీసుకునే ఆహారంలో అత్యధిక ఉప్పు కొలెస్ట్రాల్ నిల్వలు ఉన్న ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ సాఫ్ట్ డ్రింక్ వంటివి తీసుకోవడం దాదాపుగా తగ్గించి వేయాలి.
దాంతోపాటే రోజువారీ ఆహారంలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు, వాల్నట్, పిస్తా జీడిపప్పు, గుమ్మడి గింజలు వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాలి.
రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే పొటాషియం మెగ్నీషియం ఫైబర్ పుష్కలంగా ఉండే బీన్స్, రాజ్మా, గోరుచిక్కుడు, టమోటా, కాకర వంటి కాయగూరలను
ఎక్కువగా తినడంతో పాటు సిట్రస్ జాతి ఫలాలైన నిమ్మ, బత్తాయి, నారింజ, దానిమ్మ వంటి పండ్లను తినడంతో పాటు జ్యూసులను ఎక్కువగా తాగవచ్చు.
ముఖ్యంగా ఫైబర్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా లభ్యమయ్యే రాగి, జొన్న , సజ్జలు, ఉలవలు మన ఆహారంలో ఎక్కువగా ఉండునట్లు చూసుకోవాలి.
బెర్రీ జాతి పండ్లలో ఎక్కువగా అమైనో ఆమ్లాలు, సహజ యాంటీ ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించడంలో సహాయపడుతుంది.