బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన హృతిక్ రోషన్ గురించి తెలియని వారంటూ ఉండరు.
“కహో నా ప్యార్ హై” సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హృతిక్ రోషన్ ఆ సినిమా ద్వారా మంచి హిట్ అందుకొని ఎన్నో అవార్డులు అందుకున్నాడు.
ఆ తర్వాత క్రిష్, ధూమ్, జోధా అక్బర్, అగ్నిపత్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.
హృతిక్ రోషన్ ఎక్కువగా యాక్షన్ ఎంటర్టైలర్ సినిమాలలో నటించి యాక్షన్ హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
ఇక 2019లో విడుదలైన ఎంటర్టైలర్ మూవీ ” వార్ ” కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హృతిక్ రోషన్ సినిమాల గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఇక ఈ క్రమంలో వారు సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా వెల్లడించాడు.
ఆ సినిమా షూటింగ్ సమయంలో పాత్రకి అనుగుణంగా తన శరీరం మార్చుకోవటానికి ఎన్నో కష్టాలు పడినట్లు వెల్లడించాడు.
అంతేకాకుండా ఆ సినిమా వల్ల తన ప్రాణాలు పోతాయని అనుకున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా యాక్షన్ సన్నివేశాలలో హీరోలకి బదులు వారి డూప్ ఉంచి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. కానీ హృతిక్ రోషన్ మాత్రం ఎంతటి కష్టతరమైన సన్నివేశమైన తానే స్వయంగా చేస్తాడు.
ఇలా యాక్షన్ సన్నివేశాలలో నటించేటప్పుడు తాను ఎన్నోసార్లు గాయపడినట్లు వెల్లడించారు. ఇక తాజాగా తన ఫిట్నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న హృతిక్ చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
ఈ సందర్భంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. వార్ సినిమా షూటింగ్ సమయంలో తాను పడిన కష్టాల గురించి కూడా వెల్లడించాడు. వార్ సినిమా కోసం తన శరీరాన్ని మార్చుకోవటానికి చాలా కష్టపడ్డానని,
బాగా కష్టపడటంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. ఆ డిప్రెషన్ తో తాను చనిపోతానేమొనని భాయపడినట్లు వెల్లడించాడు.