మరికొన్ని రోజుల్లో మన సౌత్ ఇండియా సినిమా దగ్గర మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగు అలాగే తమిళ్ సినిమా దగ్గర కూడా ఊహించని బాక్సాఫీస్ యుద్ధం జరగబోతుంది.
అయితే మన తెలుగు సినిమాలు తమిళ్ లో డబ్ అయ్యి రిలీజ్ కావట్లేదు కానీ తమిళ్ సినిమాలు రెండు మాత్రం మన దగ్గర రాబోతున్నాయి.
అలా రానున్న చిత్రాల్లో మంచి అంచనాలు ఉన్న చిత్రమే “వారసుడు”.
హీరో విజయ్ నటించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించారు.
మరి ఈ సినిమా ఉన్నట్టుండి తెలుగు రిలీజ్ వాయిదా అంటూ కొన్ని రూమర్స్ లాస్ట్ మినిట్ లో గట్టిగా వినిపిస్తున్నాయి.
ఒక్క ఏపీ తెలంగాణలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం తెలుగు రిలీజ్ డౌటే అని టాలీవుడ్ వర్గాలు నిన్న రాత్రి నుంచి చెప్తున్నాయి.
అయితే దీనిపై అసలు క్లారిటీ ఇప్పుడు తెలుస్తుంది. వారసుడు సినిమా అయితే ఎలాంటి వాయిదా ఉండబోదు అట.
సినిమా అనుకున్న టైం కి అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది అని అంటే జనవరి 11నే సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పుడు తెలుస్తుంది.
మరి ఈ సినిమాలో విజయ్ కి జంటగా రష్మికా నటించగా థమన్ సంగీతం సమకూర్చాడు అలాగే జయసుధ, ఖుష్బూ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.