టాలీవడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం “ధమాకా”.
మరి మాస్ మహారాజ్ రవితేజ సరసన హీరోయిన్ గా శ్రీ లీల నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు త్రినాధరావు తెరకెక్కించగా తన కెరీర్ లో కూడా ఈ చిత్రం మరో భారీ హిట్ గా నిలిచింది.
వరుసగా తన సినిమాలు మంచి సక్సెస్ అందుకోగా ధమాకా అయితే తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రంగా నిలిచే దిశలా దూసుకెళ్తుంది.
వరుసగా తన సినిమాలు మంచి సక్సెస్ అందుకోగా ధమాకా అయితే తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రంగా నిలిచే దిశలా దూసుకెళ్తుంది.
కానీ ఇప్పుడు ఎట్టకేలకి సినిమా 14వ రోజు తో 100 కోట్ల మాసివ్ వసూళ్లు అందుకొని దుమ్ము లేపింది.
దీనితో రవితేజ కెరీర్ లో 100 కోట్ల భారీ వసూళ్లు అందుకున్న మరో సినిమాగా నిలిచింది.
మొత్తానికి అయితే ఇలా 2022 లో లాస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా అయితే ఈ చిత్రం గా ధమాకా నిలిచింది.
ఇక ఈ సినిమా సక్సెస్ తో అయితే రవితేజ నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు కూడా నెలకొన్నాయి.
ఈ సినిమా తర్వాత అయితే రవితేజ నుంచి పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు అలాగే రావణాసుర అనే కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఎలా రాణిస్తాయి అనేది చూడాలి.