ప్రస్తుతం ప్రపంచ సినిమా దగ్గర సెన్సేషన్ గా వైరల్ అవుతున్న ఏకైక తెలుగు సహా ఇండియన్ సినిమా పేరు “ఆర్ ఆర్ ఆర్”.
ప్రస్తుతం ప్రపంచ సినిమా దగ్గర సెన్సేషన్ గా వైరల్ అవుతున్న ఏకైక తెలుగు సహా ఇండియన్ సినిమా పేరు “ఆర్ ఆర్ ఆర్”.
ఇక వీరితో తీసిన ఈ భారీ ఆక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గత కొన్ని నెలల కితమే జపాన్ దేశంలో రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే.
మరి జపాన్ లో ఈ చిత్రం ఆల్రెడీ ఆల్ టైం ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలవగా భారీ వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా అక్కడ నిలిచింది. మరి అక్కడితో అయితే ఈ సినిమా రన్ అయిపోలేదట.
ఇప్పుడు 60 రోజులకి చేరిన ఈ సినిమా ఇంకా హవా కంటిన్యూ చేస్తుందట. అంతే కాకుండా ఇప్పుడు జపాన్ లో ఈ చిత్రానికి మరిన్ని స్క్రీన్ లు అక్కడ కేటాయిస్తున్నారట.
ఇప్పటివరకు 3 లక్షల 23 వేల 211 టికెట్స్ జపాన్ లో తెగినట్టుగా మేకర్స్ తెలిపారు. దీనితో ఈ సినిమా సెన్సేషన్ జపాన్ లో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, నటి ఆలియా భట్ తదితరులు నటించగా డీవీవీ దానయ్య భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మాణం వహించారు.