దిల్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.
అయితే ఈయన ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి విరోధిగా మారిపోయారు అందుకు గల కారణం ఈయన కోలీవుడ్ హీరో విజయ్ తో కలిసి తమిళంలో వరిసు అనే సినిమా చేయడమే కారణం.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదల కానుంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దిల్ రాజు హీరో విజయ్ ని ప్రశంసలతో ముంచెత్తారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో విజయ్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.
అయితే ఇలా స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నటువంటి ఈయనకు ఏ మాత్రం ఈగో లేదని దిల్ రాజు తెలిపారు.
విజయ్ కోసం మేము తన క్యాబిన్ లో వెయిట్ చేస్తున్నప్పుడు అతను వచ్చి స్వయంగా తన చేతులతో మాకు కాఫీ కప్పులు అందించారని తెలిపారు.
ఇప్పటికి నాకు ఆ విజువల్స్ అలా కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి.
అయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది మెగాస్టార్లు సూపర్ స్టార్లు ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా చేయలేదని దిల్ రాజు తెలిపారు.
ఇలా దిల్ రాజు హీరో విజయ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ టాలీవుడ్ హీరోలను కించపరిచేలా మాట్లాడటంతో మెగా సూపర్ స్టార్ అభిమానులు దిల్ రాజును భారీగా టోల్ చేస్తున్నారు.
నీకు కాఫీ కప్పులు అందిస్తే మంచివాళ్లు అందివ్వకపోతే వారిని ఇలా చులకనగా మాట్లాడతావా దిల్ రాజు అంటూ దిల్ రాజు పై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా దిల్ రాజు వరిసు సినిమా వల్ల టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు విరోధిగా మారారని ఈ సినిమా విషయంలో తరచూ ఈయన టాలీవుడ్ పై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారని చెప్పాలి.