ఈ మధ్యకాలంలో పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరూ తమ ఆలోచన ధోరణిని పూర్తిగా మార్చుకున్నారు. పెళ్లికి వయసుతో సంబంధం లేదని మనసుతో మాత్రమే పని అని చెబుతున్నారు.
మనసుకు నచ్చితే పెళ్లి చేసుకోవడానికి వయసు అడ్డురాదంటూ ఎంతోమంది నటీనటులు లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగితే పెళ్లిళ్లు చేసుకుంటున్న సందర్భాలను మనం చూస్తున్నాము.
అయితే కొన్ని కారణాల వల్ల కొందరు నటీనటులు వారి పార్ట్నర్ ను కోల్పోవడం వల్ల ఒంటరిగా గడుపుతున్నారు. ఇలా ఒంటరితనాన్ని భరించలేక కొందరు లేటు వయసులో రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు వయసు పైబడిన తర్వాత పెళ్లిళ్లు చేసుకోగా తాజాగా మరొక నటి కూడా రెండవ పెళ్లికి సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో సహజనటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు.
అయితే ఈమె గత కొన్ని సంవత్సరాలు క్రితం తన భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే జయసుధ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి.
తాను ఒంటరితనాన్ని భరించలేక ఈమె రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తలపై జయసుధ స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొందరు ఉద్దేశపూర్వకంగానే నాపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని తెలిపారు.
ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తనకు ఒంటరి
అనే భావన లేదని సినిమాలతో బిజీగా గడుపుతూ ఉన్నానని ఈ సందర్భంగా ఈమె తన రెండో పెళ్లి గురించి వచ్చే వార్తలను కొట్టి పారేశారు.