మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా “ధమాకా”.
సూపర్ హిట్స్ సినిమాల దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఎంతగానో అలరించి అయితే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రవితేజ కెరీర్ లో బిగ్ హిట్ దిశగా దూసుకెళ్తుంది.
మరి ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా రొటీన్ లైన్ తో వచ్చిన ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా హాఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ ని చేరుకొని ట్రేడ్ సర్కిల్స్ కి షాకిచ్చింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా మొత్తం 9 రోజులకి రన్ చేరుకోగా ఈ 9 రోజుల్లో అయితే అదిరే వసూళ్లతో హవా కొనసాగిస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు.
మరి వాళ్ళు చెప్తున్నా దాని ప్రకారం అయితే ధమాకా మొత్తం 9 రోజుల్లో 77 కోట్ల భారీ గ్రాస్ ని సొంతం చేసుకుందట. అంటే మళ్ళీ 9వ రోజున ఈ చిత్రం 8 కోట్ల గ్రాస్ భారీ జంప్ తో మళ్ళీ పుంజుకుంది.
దీనితో ఓ పర్ఫెక్ట్ హిట్ వస్తే తెలుగు ఆడియెన్స్ ఏ రేంజ్ లో సినిమాని ఆదరిస్తారో చెప్పడానికి ఈ సినిమా హిట్ కూడా ఒక నిదర్శనం ని చెప్పాలి.
ఇక ఈ సినిమా లో అయితే యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించగా భీమ్స్ ఇచ్చిన సంగీతం ఆల్బమ్ సినిమా హిట్ లో బిగ్ రోల్ పోషించింది.
అలాగే ఈ సినిమా ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.