మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రజలందరూ వారంలో ఉన్న ఏడు రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని పూజిస్తూ ఉంటారు.
ఇలా సోమవారం రోజున శివుడిని పూజిస్తే, మంగళవారం రోజున హనుమంతుడిని పూజిస్తూ ఉంటారు.
ఇక బుధవారం రోజున వినాయకుడిని, గురువారం రోజున సాయిబాబా, శుక్రవారం రోజున లక్ష్మీదేవి, శనివారం రోజున శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు.
అలాగే ఆదివారం రోజు కూడా చాలామంది సూర్య భగవానుడిని పూజిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా చాలామంది కొన్ని వారాలలో మాంసం తినకూడదని నియమాలు పెట్టుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా సోమవారం శుక్ర,శనివారాలలో చాలామంది ప్రజలు మాంసం తినరు. కానీ మంగళ, ఆదివారాలలో మాత్రం చాలామంది మాంసాహారం తింటూ ఉంటారు.
అయితే మంగళవారం రోజు ఆ హనుమంతుడికి అంకితం చేయబడింది. అందువల్ల మంగళవారం రోజున జీవహింస చేయటం వల్ల పాపం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి.
మంగళవారం రోజున మాంసాహారం తినడం వల్ల అనేక చెడుపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆంజనేయ స్వామి భక్తులు మంగళవారం రోజున మాంసాహారం తినడం వల్ల ఆంజనేయ స్వామి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.
దాని ఫలితంగా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కలిగే ఫలితాలకంటే నష్టాలు పెరుగుతాయి. ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించటం వల్ల అనుకున్న పనులు సాధించగలరు.
అయితే ఇవన్నీ కూడా సాధ్యం అవ్వాలి అంటే తప్పనిసరిగా మంగళవారం రోజు మాంసాహారం తినకుండా ఉండాలి.
మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజించే భక్తులు మాంసాహారం తినడం వల్ల వారికున్న సమస్యలు నెరవేరకపోగా కొత్త సమస్యలు ఎదురవుతాయి.
అంతే కాకుండా మంగళవారం రోజున మాంసాహారం తినటం వల్ల కుటుంబంలో సంతోషానికి బదులుగా కుటుంబసభ్యుల మధ్య కలహాలు ఏర్పడి ఆ కుటుంబంలో దుఃఖం పెరిగే అశాంతి నెలకొంటుంది.
అంతే కాకుండా క్రమంగా ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతాయి. అందువల్ల మంగళవారం రోజున మాంసాహారం తినకుండా నియమనిష్టలతో ఆంజనేయ స్వామికి ఇష్టమైన తులసి మాల,
మందార పువ్వులు, కాషాయ కుంకుమ, మల్లెపూల తైలం,ఎర్రటి మిఠాయి సమర్పించి పూజించటం వల్ల ఆంజనేయ స్వామి సంతోషించి తప్పకుండా అనుగ్రహిస్తాడు.