ఆలూ లేదు.. చూలూ లేదు, అప్పుడే కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో ఎవరికీ తెలియదు.
ప్రస్తుతానికైతే ‘హరిహర వీరమల్లు’ సినిమాని పూర్తి చేయాల్సి వుంది పవన్ కళ్యాణ్. అదే పనిలో బిజీగా వున్నాడాయన.ఇంకోపక్క, సుజీత్ దర్థకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కాల్సి వుంది.
చాలాకాలంగా ఎదురుచూస్తున్న హరీష్ శంకర్, ‘భవదీయుడు భగత్ సింగ్’ టైటిల్లోని ‘భవదీయుడు’ని పక్కన పెట్టి, ‘ఉస్తాద్’ని తీసుకొచ్చాడు.
ఇంకోపక్క, ‘వినోదియ సితం’ సినిమా రీమేక్‌ని పట్టాలెక్కించాలన్న ఆలోచన కూడా వుంది పవన్ కళ్యాణ్‌కి.
ఇంతలోనే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన గాసిప్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
‘కెవ్వు కేక..’ అంటూ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో ఐటమ్ సాంగ్ కోసం ఆడి పాడిన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం తీసుకొచ్చే ఆలోచన వుందన్నదే ఆ గాసిప్ సారాంశం.
ఇందులో నిజమెంత.? ప్రస్తుతానికైతే సస్పెన్స్. నిజమైతే మాత్రం అది రాంగ్ ఛాయిస్.!