ఈ ఏడాది శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా ఒంట్లో వేడి నశించిపోయి చలి తీవ్రత వేధిస్తోంది.దానికి తోడు కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని శీతాకాలంలో మన ఒంట్లో వేడిని పెంచి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.
ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్ న్యుమోనియా సమస్యలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో ఒంట్లో వేడిని పెంచి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకుంటే
ఇందులో ఉండే సహజ యాంటీ, ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.
అలాగే అత్యధిక ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, పీచు పదార్థం సమృద్ధిగా లభించే తృణధాన్యాలను రోజువారి ఆహారంలో తీసుకుంటే ఒంట్లో వేడి కలగడంతో పాటు మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది సీజనల్గా వచ్చే అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
ఉదయం, సాయంత్రం వేడి అల్లం పాలను సేవిస్తే ఒంట్లో వేడి తగ్గడంతో పాటు అల్లం లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది.
చికెన్ సూప్స్, కార్న్ సూప్, టమాటో సూప్ వంటివి వేడి వేడిగా సాయంత్రం వేళ తాగుతూ ఉండాలి. ఇవి కూడా శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా కాపాడతాయి.
శీతాకాలంలో నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటే శరీరంలో వేడిని కలిగించి శరీర ఉష్ణోగ్రతలను కాపాడుతుంది.
సాయంత్రం వేళ ఉలువ గుగ్గిళ్ళు, తామర గింజలను ఆహారంగా తీసుకుంటూ కండరాలు ఎముకలు దృఢంగా తయారవుతాయి. విటమిన్ సి పుష్కలంగా లభించే సిట్రస్ జాతి పలాలను ఎక్కువగా తినాలి.
పల్లీలు, చిక్కిలు, జీడిపప్పు ,బాదం, వాల్నట్ ఎక్కువగా తీసుకుంటే సంపూర్ణ పోషకాలు సమృద్ధిగా లభించే మనలో వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది.