మరికొన్ని రోజులలో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నారు.ఇలా కొత్త ఏడాదికి స్వాగతం పలకడం కోసం ఎంతో మంది సెలెబ్రెటీలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలు ఇతర దేశాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఇలా ఎవరికి తగ్గట్టు వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సైతం తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాల్దీవ్స్ లో జరుపుకోవడానికి సిద్ధమయ్యారట.
ఇలా ప్రభాస్ 31 డిసెంబర్ మాల్దీవులకు వెళ్లి ఆ రోజు నైట్ మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేయడం కోసం ఇప్పటికే అంత సిద్ధం చేశారని సమాచారం.
అయితే మాల్దీవ్స్ లో ప్రభాస్ ఒంటరిగా కాకుండా ఇండస్ట్రీకి చెందిన మరొక నటితో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోనున్నట్టు సమాచారం.
మరి ప్రభాస్ తో హనీ ఎయిర్ సెలబ్రేషన్స్ లో పాల్గొనబోయే నటి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే… ప్రభాస్ నటి కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని కృతి స్పందించినప్పటికీ వీరిద్దరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలకు ఏమాత్రం పులిస్టాప్ పడలేదు.
ఇలా ప్రతిరోజు ఏదో ఒక వార్త వీరీ గురించి వైరల్ అవుతుంది.
తాజాగా వీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొనబోతున్నారని తెలియడంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.