సాధారణంగా గుమ్మడికాయలు సంక్రాంతి పండుగ రోజున ఎక్కువగా ఉపయోగిస్తారు. గుమ్మడికాయలు రెండు రకాలుగా ఉంటాయి.
ఒకటి బూడిద గుమ్మడికాయ మరొకటి సాధారణ గుమ్మడికాయ. బూడిద గుమ్మడి కాయలు ఎక్కువగా దిష్టి తీయటానికి ఉపయోగిస్తారు.
ఇక సాధారణ గుమ్మడికాయలను ఎక్కువగా వంటలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. బాగా పండిన గుమ్మడికాయలతో అనేక రకాల వంటలు తయారు చేసుకోవచ్చు.
ఈ గుమ్మడికాయతో తయారు చేసిన వంటలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి.
గుమ్మడికాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..? దానిని ఎలా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గుమ్మడికాయ తీసుకొని అందులోపల ఉన్న విత్తనాలు తొలగించి దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే ఐదు పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బలు, గుమ్మడి ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.
ఆ తర్వాత ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి ఇరవై నిమిషాల పాటు నీటిని ఉడికించాలి. ఇలా బాగ మరుగుతున్న నీటిలో గుమ్మడికాయ ముక్కలు వేసి ఉడికించాలి.
ఆ తర్వాత వెల్లుల్లి గుమ్మడికాయ ముక్కలను మెత్తగా మిక్సి వేసుకొని పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ కొబ్బరి పాలు, రుచికి సరిపడా ఉప్పు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ పచ్చి మిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి గుమ్మడికాయ పేస్ట్ వేసి గ్రైండ్ చేసుకొని గుమ్మడి కాయ సూప్ తయారు చేసుకోవాలి. ఇలా టేస్టీగా ఉన్న గుమ్మడికాయ సూప్ తయారుచేసుకొని తాగటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
తరచూ ఉమ్మడికాయతో తయారుచేసిన సూప్ తాగటం వల్ల రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
రక్త ప్రసరణ సక్రమంగా జరగటం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. అంతేకాకుండా ఈ గుమ్మడికాయ సూప్ తాగటం వల్ల కంటి చూపు కూడా మెరుగు పడుతుంది.
అలాగే అధిక బరువుతో బాధపడేవారు తమ డైట్ లో గుమ్మడి సూప్ తీసుకోవటం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ సూప్ తాగటం వల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.