టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్న హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వంటి సీనియర్ హీరోలతోనే కాకుండా మహేష్ బాబు నితిన్ ఎన్టీఆర్ వంటి కుర్ర హీరోలతో కూడా నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
తెలుగులోనే కాకుండా తమిళ్ భాషలో కూడా స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన త్రిష సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది.
ఇక వయసు పెరుగుతున్న కొద్ది త్రిష గ్లామర్ మాత్రం తగ్గటం లేదు. ఇక ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా మంచి హిట్ అందుకుంది.
ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్లు ఉండటం సర్వసాధారణం. కొంతమంది వాటిని బహిర్గతం చేస్తుంటే మరి కొంతమంది మాత్రం రహస్యంగా వారి రిలేషన్ కొనసాగిస్తూ ఉంటారు.
ఇక త్రిష కూడా ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో రిలేషన్ లో ఉన్నట్లు గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. ప్రముఖ తమిళ హీరో శింబు తో ప్రేమాయణం నడిపిన త్రిష కొంతకాలానికి అతనికి బ్రేకప్ చెప్పింది.
ఇక టాలీవుడ్ లో కూడా దగ్గుబాటి రానా తో కూడా కొంతకాలం ప్రేమాయణం నడిపింది. అయితే ఇద్దరికీ వర్కౌట్ అవ్వకపోవడంతో ఇద్దరూ దూరమయ్యారు.
ఆ తర్వాత ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా త్రిష తమ రిలేషన్ ని బ్రేకప్ చేసుకొని ఇప్పటికీ ఒంటరిగా మిగిలిపోయింది.
ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష.. రానా గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు కూడా గతంలో తెగ వైరల్ అయ్యాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష రానా గురించి మాట్లాడుతూ… రానా చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలు ఉంటారని షాకింగ్ కామెంట్స్ చేసింది.
అంతే కాకుండా రానాకు ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా అందరితో చక్కగా కలిసి పోతాడని రానా గురించి గొప్పగా కూడా చెప్పింది.
దీంతో రానా గురించి త్రిష చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.