మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన చిత్రాల్లో మొత్తం మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే.
మరి వీటిలో అయితే ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఖిలాడీ భారీ ప్లాప్ కాగా దీని తర్వాత వచ్చిన నెక్స్ట్ సినిమా రామారావు ఆన్ డ్యూటీ అంతకన్నా పెద్ద ప్లాప్ అయ్యింది.
ఇక దీనితో మళ్ళీ రవితేజ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. ఇక ఇప్పుడు అయ్యితే ఇది తన లేటెస్ట్ మాస్ మసాలా హిట్ “ధమాకా” తోనే నెరవేరిపోయింది.
ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్న ఆ హిట్ ని దర్శకుడు త్రినాథరావు నక్కిన మాస్ మహారాజ్ కి అందించారు.
అదిరే ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు మూడు రోజులు బాక్సాఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకోగా
మరి ఈ మూడు రోజుల్లో అనూహ్యంగా మొదటి రోజు కంటే రెండో రోజు అలాగే రెండో రోజు కంటే మూడో రోజు వసూళ్లు అధికంగా రావడం రవితేజ జిత్ స్టామినా చూపించాయి.
ఇక రెండు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ 19 కోట్ల గ్రాస్ ని అందుకోగా మూడో రోజుకి ఏకంగా 13 కోట్ల గ్రాస్ అందుకొని మొత్తం మూడు రోజుల్లో 32 కోట్ల సాలిడ్ గ్రాస్ ని ఈ చిత్రం రాబట్టేయడం గమనార్హం.
దీనితో ఈ క్రేజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యింది అని చెప్పాలి.
ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం ఆదరణ మరింత గట్టిగా ఉందట. దీనితో ఇలా ధమాకా సెన్సేషన్ ని నమోదు చేస్తుంది.