తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “వరిసు” కోసం తెలిసిందే.
మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఒకో అప్డేట్ తో అయితే సినిమాపై హైప్ ని ఎక్కడా కూడా తగ్గించుకోకుండా తీసుకెళ్తుంది.
ఇక సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ చిత్రంలో ఆల్రెడీ సంగీత దర్శకుడు థమన్ మూడు చార్ట్ బస్టర్ సాంగ్స్ ని అందించాడు.
అలాగే సరిగ్గా గమనిస్తే ఈ సినిమా కోసం థమన్ చాలా స్పెషల్ సింగర్స్ ఎంపిక చేసాడు అని చెప్పాలి. మొదటి సాంగ్ స్వయంగా విజయ్ తోనే పాడించగా నెక్స్ట్ ప్రముఖ హీరో శింబుని దింపాడు.
ఆ తర్వాత వెర్సటైల్ సింగర్ చిత్రమ్మతో సాంగ్ పాడించాడు.
ఇక నిన్ననే తమిళ నాట గ్రాండ్ ఆడియో ఫంక్షన్ జరగ్గా అందులో మరో రెండు పాటలు తెలిసాయి. దీనితో కొంతమందికి వీటి కోసం రివీల్ అయ్యింది.
ఇక తాజాగా రిలీజ్ చేసిన ఆడియో జ్యూక్ బాక్స్ లో వెర్సటైల్ సింగర్ శంకర్ మహదేవన్ అలాగే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో కూడా ఓ సాంగ్ ఉంది.
మరి వీరితో పాటుగా మ్యూజిక్ లవర్స్ మోస్ట్ ఫేవరేట్ సిద్ శ్రీరామ్ తో కూడా సాంగ్ ఉందని ఇప్పుడు తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.