దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతూ పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటూ వివిధ సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్రతారాలుగా కొనసాగుతూ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
మరి ఏ హీరోయిన్ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయానికి వస్తే ….
నయనతార: లేడీ సూపర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార ఒక్కో సినిమాకు రెండు నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
ఈమె సినీ కెరియర్ లో ఇప్పటివరకు 75 సినిమాలలో నటించారు.
అనుష్క శెట్టి: తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ఒక్కో సినిమాకి 6 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
సమంత: దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇక ఈమె కూడా ఒక్కో సినిమాకు ఆరు నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
పూజా హెగ్డే: కెరియర్ మొదట్లో పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి పూజా హెగ్డే ప్రస్తుతం అగ్రతారగా ఓవెలుగు వెలుగుతున్నారు.
ఇక ఈమె కూడా ఒక్కో సినిమాకు మూడు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
రష్మిక: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నటువంటి రష్మిక ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.