ఈ రోజుల్లో చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరికలేని ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక శారీరక శ్రమ, సమయానికి భోజనం చేయకపోవడం, నీళ్లను తక్కువగా తాగడం, వాతావరణ కాలుష్యం, కంప్యూటర్ మొబైల్స్ ఎక్కువగా చూడడం, దీర్ఘకాలిక అనారోగ్య
సమస్యలు వంటి కారణాలతో చాలామంది ప్రతిరోజూ తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారు.
తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి ప్రతిరోజు ఏవేవో మందులు, మాత్రలు వేసుకొని కాలం గడిపితే భవిష్యత్తులో తీవ్రఅనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తలనొప్పి సమస్య నుంచి బయటపడడానికి ముందు తలనొప్పి ఎందుకు వస్తుంది అన్న విషయాన్ని గ్రహించి తగిన తగిన సూచనలు పాటిస్తే తలనొప్పి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉన్నవారిలో నాడీ కణాలు బలహీనపడి తరచూ మైగ్రేన్ తలనొప్పి ఎక్కువగా వస్తుంది.
మీ డైట్మెగ్నీషియం ,జింకు సమృద్ధిగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ,చిరుధాన్యాలను ఎక్కువగా తింటే తలనొప్పి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
తీవ్ర తలనొప్పిగా ఉన్నప్పుడు గంధపు మిశ్రమాన్ని చూర్ణంగా చేసి తలపై మర్దన చేసుకుంటే సమస్య తగ్గుతుంది.
రాత్రులు ఎక్కువసేపు మేలుకోకుండా సమయానికి భోజనం చేసి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
మన శరీరం డిహైడ్రేషన్ సమస్యకు గురైనప్పుడు జీవక్రియలకు అవసరమైన నీరు సమృద్ధిగా లభించక శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మందగిస్తుంది దాంతో తీవ్రమైన తలనొప్పి సమస్య ఏర్పడుతుంది.
ఈ సమస్య నుంచి బయటపడడానికి దాహం లేకపోయినా తరచూ నీళ్లను తాగుతూనే ఉండాలి. వైద్యుల సూచనల ప్రకారం ఒక రోజులు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవాలి.
అప్పుడే శరీరంలోని చెడు లవణాలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. తలనొప్పిగా అనిపించినప్పుడు వెంటనే మాత్ర వేసుకోకుండా గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకొని సేవించి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది.
దీర్ఘకాలం పాటు తలనొప్పి సమస్య తీవ్రంగా వేధిస్తుంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహాలు తీసుకోవాలి..