Home News Andhra Pradesh సీఎం జ‌గ‌న్ చుట్టూ ప్ర‌క్షాళ‌న అందుకేనా?

సీఎం జ‌గ‌న్ చుట్టూ ప్ర‌క్షాళ‌న అందుకేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చుట్టూ కీల‌క మార్పులు జ‌రిగాయి. సీఎంఓ కార్యాల‌యంలో భారీగా ప్ర‌క్షాళ‌న జ‌రిగింది. దీంతో జ‌గన్ కి స‌న్నిహితులుగా పేరుగాంచిన ఐఏఎస్ అధికారి అజ‌య్ క‌ల్లంకి క‌ళ్లెం ప‌డ‌టం రాజ‌కీయంగా చ‌ర్చ‌కొచ్చింది. సీఎం కార్యాల‌యం బాధ్య‌త‌ల నుంచి అజయ్ క‌ల్లం, పీవీ ర‌మేష్‌, జే ముర‌ళీల‌ను త‌ప్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆ ముగ్గ‌రి బాధ్య‌త‌ల్ని ప్ర‌వీణ్ ప్ర‌కాష్‌, సాల్మాన్ ఆరోఖ్య రాజ్, ధ‌నుంజ‌య్ రెడ్డిల‌కు బ‌ద‌లాంపులు జ‌రిగాయి. ప్ర‌వీణ్ ప్రకాష్ ప‌రిధిలో జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయ‌శాఖ‌, కేంద్ర రాష్ర్ట సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డ్ చేరాయి. సాల్మ‌న్ ఆరోఖ్య రాజ్ ప‌రిధిలో ర‌వాణా, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ, గృహ నిర్మాణం, పౌర స‌ర‌ఫ‌రాలు, పీఆర్, సంక్షేమం, విధ్యామండ‌లి, పెట్టుబ‌డులు, ఐటీ, గ‌నులు, కార్మిక శాఖ చేరాయి.

ఇక ధ‌నుంజ‌య్ రెడ్డి ప‌రిధిలో జ‌ల‌వ‌న‌రులు, అట‌వీ, మున్సిప‌ల్, వ్య‌వ‌సాయం, వైద్యారోగ్యం, ఇంధ‌నం, టూరిజం, మార్కెటింగ్, ఆర్ధిక శాఖ ఉన్నాయి. అయితే అజ‌య్ క‌ల్లంకు క‌ళ్లెం ప‌డ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అజయ్ ఎన్నిక‌లు ఆరు నెల‌లు ముందు నుంచి జ‌గ‌న్ స‌న్నిహితుడిగా మారారు. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు కీల‌క అధికారిగా అజ‌య్ ప‌నిచేసారు. దీంతో అక్కడ‌ లోగుట్టు పై ఆయ‌న‌కు బాగా ప‌ట్టు ఉంది. అవ‌న్నీ ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ విమ‌ర్శ‌నాస్ర్తాలుగా మ‌లుచుకుని చంద్ర‌బాబు పై ప్ర‌యోగించారు. ఇక జ‌గ‌న్ అధికారంలోకి రాగానే అజ‌య్ క‌ల్లం ని జ సీఎంకి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా జ‌గ‌న్ ప‌క్క‌నే పెట్టుకున్నారు.

ల‌క్ష‌ల్లో జీతాలిచ్చి కొన్ని శాఖ‌ల‌పై ప్ర‌త్యేక అధికారం క‌ల్పించారు. అయితే త‌ర్వాత కాలంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో అజ‌య్ క‌ల్లం స్వీయా త‌ప్పులు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. ముఖ్యంగా అర్ధిక వ్య‌వ‌హారాల్లో క‌ల్లం త‌ల దూర్చార‌ని ప్ర‌చారం సాగింది. ఈ నేప‌థ్యంలో కొన్నాళ్ల‌పాటు ఆయ‌న్ని దూరం పెట్ట‌డం జ‌రిగింది. అయినా ప‌రిస్థితుల్లో మార్పు రాలేదు. అలా ప్రాధాన్య‌త త‌గ్గిస్తూ వ‌చ్చారు. చివ‌రికిలా ప‌క్క‌న పెట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. ప్ర‌భుత్వానికి హైకోర్టులో భంగ‌పాటు ఎదుర‌వ్వ‌డం, ప్ర‌తీ తీర్పు ప్రభుత్వానికి ప్ర‌తికూలంగా మార‌డం వెనుక ప్ర‌తిప‌క్షానికి లీకులందుతున్నాయ‌నే ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. ఈ కార‌ణాలు కూడా జ‌గ‌న్ ప‌రిగణ‌లోకి తీసుకుని ప్ర‌క్షాళ‌న చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

Telugu Latest

రియ‌ల్ హీరో పై కంపెనీల వలయం !

సినిమాల్లో విల‌న్ వేషాలు వేసే వాళ్లల్లో నిజమైన హీరో ఉంటాడని ఆ నాటి యస్వీఆర్ నుండి నేటి సోనూ సూద్ వరకూ నిదర్శనంగా నిలుస్తున్నారు. విలనిజాన్ని ఓ రేంజ్‌లో పండించే అలవాటు ఉన్న...

సుశాంత్ సింగ్ చావు వెనుక ఉంది ఆమేనా  ? 

బాలీవుడ్ లో ఒక అనామకుడు హీరోగా స్టార్ డమ్ సంపాదించడం అంటే మాటలు కాదు. కానీ అది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సాధించాడు. చివరికీ అనేక అనుమానాలను అపోహలను మిగిల్చి ఈ లోకం...

బాలీవుడ్  వెబ్ సిరీస్ పై అఖిల్ మోజు!?

కరోనా వైరస్ మహమ్మారి తో వినోదరంగం  విలవిలలాడిపోతోంది.  ప్రపంచ దేశాల ప్రజలు  మహమ్మారి బారిన పడటంతో లాక్ డౌన్ అమలు లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయం లో ప్రజలు ఎక్కువగా...

అక్కాచెల్లెళ్ల‌తో మెగాస్టార్ రాఖీ సంబ‌రం

నేడు సెల‌బ్రిటీలంతా రాఖీ పండ‌గ‌ను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. రాఖీ మ‌తపరమైన పండుగ అయినా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా జ‌రుపుకున్నారు. తారలు తమ ప్రియమైనవారితో అక్క చెల్లెళ్ల‌తో ఫోటోల్ని షేర్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో చాలా...

దివ్య‌భార‌తి, శ్రీ‌దేవి, సుశాంత్ .. ఇవ‌న్నీ హత్య‌లే!- అర్నాబ్ గోస్వామి

                                     రిప‌బ్లిక్ చానెల్ యాంక‌ర్ పై ఆర్జీవీ సినిమా ఆర్జీవీ...

English Latest

Teja tests positive for Covid- Quarantined at home

The Coronavirus is now attacking all the celebs and is not leaving anyone alone at all. The latest celeb to turn positive for the...

Big suspense angle in Rajamouli’s RRR

Ram Charan and NTR were shooting for their film RRR without any breaks for a long time as many said that Rajamouli is not...

Latest- Fans Want to boycott IPL

The cricket fans in the country of India were disappointed as the cash-rich IPL was postponed due to the lockdown situation. But they were...

Did Sushanth plan his suicide days before he passed away?

This is the big question that has been posted on everyone's mind. The Mumbai cops are surely delaying the case and that is clearly...

Jagan killing with his silence

All the politicians from various political parties be it Chandra Babu of TDP, Pawan Kalyan of Jana Sena expressed their views for or against...

Actor/Actress/Celebrity