చిన్నారులను హింసించిన దుర్మార్గుడు, వాడిని వదలొద్దంటున్న నెటిజన్లు(వీడియో)

చిన్న పిల్లలు ఎలా ఉన్నా ముద్దుగా అనిపిస్తారు. వారు అల్లరి చేసినా ముద్దుగానే అనిపిస్తుంది. వారు ఏం చేసినా అది ఆనందాన్నే పంచుతుంది. వారికి చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేం. అటువంటిది ఓ దుర్మార్గుడు ఆటాడుకుంటున్న చిన్నారులను ఇష్టమొచ్చినట్టు కొట్టడమే కాకుండా వారిని చంపాలని చూశాడు. వారిని కొట్టుకుంటూ సెల్ ఫోన్ లో వీడియో తీస్తూ రాక్షసానందం పొందాడా దుర్మార్గుడు. దీనికి సపోర్టుగా ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దుర్మార్గురాలికైనా జాలి కలగలేదేమో. పాపం ఆ పిల్లలు తల్లడిల్లిపోయారు. ముద్దుగా ఉన్న ఆ పిల్లలు దెబ్బలకు తాళలేక తల్లడిల్లారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో అంటూ బాధపడుతున్నారు. వాడు దొరకాలే కానీ వాడిని వదిలిపెట్టాం అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఆధారంగా అది ఎక్కడ జరిగిన సంఘటనో తెలుసుకుని ఆ రాక్షసులపై చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దుర్మార్గులు చిన్నారులను ఏ విధంగా హింసించారో వీడియో లో ఉంది.

[videopress BaYAIZ2K]