Home Politics రంగారెడ్డి టిఆర్‌ఎస్‌లో అవిశ్వాసాల లొల్లి

రంగారెడ్డి టిఆర్‌ఎస్‌లో అవిశ్వాసాల లొల్లి

తెలంగాణలో మున్సిపల్, మండల పరిషత్ లలో అవిశ్వాసాల చిచ్చు రగులుతూనే ఉంది. మున్సిపల్ , మండల పరిషత్ లు ఏర్పడి నాలుగు సంవత్పరాలు పూర్తి కావడంతో అసంతృప్తులంతా అవిశ్వాస రాగమెత్తారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టిల్లో, మండల పరిషత్ లలో అవిశ్వాస సమస్య అధికార టిఆర్ ఎస్ పార్టీకి పెను సవాల్ గా మారింది.

రంగారెడ్డి జిల్లాలోనూ అవిశ్వాస సమస్య ప్రారంభమైంది. పెద్దేముల్ ఎంపీపీ వాణిశ్రీ పై పొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మాణం పెట్టి పదవి నుంచి తొలగాంచారు. ఆమె స్థానంలో వైస్ ఎంపీపీగా ఉన్న నర్సమ్మకు బాధ్యతలు అప్పగించారు.

బడంగ్ పేట మున్పిపల్ చైర్మన్ నర్సింహ్మపై కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మాన నోటీసును జేసీ కి అందజేశారు. నర్సింహ్మగౌడ్ కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ ఎస్ లో చేరి చైర్మన్ గా ఎన్నికయ్యాడు. ఈ మున్సిపాలిటిలో 20 మంది కౌన్సిలర్లు ఉండగా ఇందులో ఆయనకు వ్యతిరేకంగా 13మంది అవిశ్వాస నోటిసుపై సంతకాలు చేశారు. అయితే మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నియోజక వర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో నియోజక వర్గ పరిధిలో చేజారిన బడంగ్ పెట మున్పిపాల్టిని తిరిగి దక్కించుకునేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు నేతలను క్యాంపులకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ చేజారిన మున్సిపల్ ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

తాండూర్ మండల పరిషత్ లోను అవిశ్వాస సెగలు మొదలయ్యాయి. తాండూరు అధికార టిఆర్ ఎస్ ఎంపీపీ కోస్గీ లక్ష్మమ్మపై టిఆర్ ఎస్ అసంతృప్త నేతలు అవిశ్వాస నోటిసును ఆర్డీవో వేణుకు అందజేశారు. వీరికి ఆరుగురు కాంగ్రెఃస్ పార్టీ సభ్యులు మద్దతు ఇవ్వటం గమనార్హం. లక్ష్మమ్మ అభివృద్ది పనులు చేపట్టడంలో విఫలమయ్యారని అందుకే మండలం వెనుకబడి ఉందని ఆ కారణంతోనే అవిశ్వాస తీర్మానం ఇచ్చామని నేతలు అంటున్నారు.

ఇక ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ భరత్ కుమార్ ను గద్దె దించేందుకు అధికార పార్టీ నేతలే పావులు కదుపుతున్నారు. కొంతమంది కౌన్సిలర్లు ఇప్పటికే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ ను కలిశారు. కానీ ఆయన అలా చేస్తే పార్టీకి తనకు చెడ్డపేరు వస్తుందని వారికి నచ్చచెప్పి పంపినట్టు తెలుస్తుంది. మెజార్టీ సభ్యులు అవిశ్వాసం పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు.

వికారాబాద్ మున్పిపాలిటి చైర్మన్ సత్యనారాయణ కాంగ్రెస్ సురేష్ టిఆర్ ఎస్ లపై అవిశ్వాసం పెట్టాలని కౌన్సిలర్లు పావులు కదుపుతున్నరు. పెద్దఅంబర్ పేట లో కూడా అవిశ్వాసం పై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల సొంత పార్టీ నేతలే అవిశ్వాసానికి సిద్దమవుతుంటే పలుచోట్ల అవిశ్వాసాలు పెట్టక తప్పదేమో అన్న పరిస్థితి ఏర్పడింది. ఈ అవిశ్వాస చిచ్చుతో టిఆర్ ఎస్ నేతలు, కేసీఆర్ అంతర్మథనంలో పడ్డారు. మరీ అవిశ్వాసాల చిచ్చు ఎప్పుడు చల్లారుతుందో చూడాలి.

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

ఎదురీదుతున్న జెసి వారసులు

రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని పోటీ చేస్తున్న జేసి బ్రదర్స్ వారసులు ఎదురీదుతున్నారు. పోయిన ఎన్నికల్లో అనంతపురం, తాడిపత్రి లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో జేసి బ్రదర్స్ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి...

కెసిఆర్ ప్రత్యేక హోదా మద్దతు ఇస్తే తప్పా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదాకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మద్దతు నీయడం తప్పా అని వైఎస్ ఆర్ ఎసి కాంగ్రెస్ నేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు అనంతపురం జిల్లా...

ఈసీ ముందు హాజరైన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నిర్మాత,ఫైనల్ గా తేల్చిందిదీ

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన సంచలనాత్మక చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమాలో అభ్యంతరకరమైన అంశాలేమైనా ఉన్నాయా? లేదా? పరిశీలించేందుకు మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) ముందు చిత్రం...

మహేష్ ‘ద్విపాత్రాభినయం’ అని మురస్తున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూసిన సమయం వచ్చేసింది . మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు రూపొందించిన మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు....

 అప్పుడే ఫైళ్ళపై సంతకాలట ? సిఎం అయిపోయినట్లేనా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో జనసేన వర్గాలే ఆశ్చర్యపోతున్నారు. తాను ముఖ్యమంత్రి కాగానే సంతకాలు చేయబోయే మూడు ఫైళ్ళ గురించి చెప్పటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కృష్ణాజిల్లాలోని కైకలూరు అసెంబ్లీ...

శృతిహాసన్ ను బ్లాక్ మెయిల్ : ప్రముఖ నిర్మాతపై ఆరోపణలు

లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ప్ప‌టికి అతి త‌క్కువ కాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకుంది శృతిహాసన్. తెలుగు,త‌మిళ స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్‌గా మారింది. కెరీర్...

చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ షర్మిల

ఏపీ సీఎం చంద్రబాబు కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో భూతద్దం పెట్టి వెతికినా ఎలాంటి  అభివృద్ధి...

యూ టర్న్ తీసుకున్న సప్నా చౌదరి… కాంగ్రెస్ కు షాక్

సప్నా చౌదరి.... డ్రీమ్‌ చౌదరి అని ఆమెకు మరో పేరు. పేరు మోసిన హరియాణా గాయని, డాన్సర్‌ కూడా! 2018లో నెట్లో అత్యధికులు ‘వెతికిన’ (సెర్చ్‌ చేసిన) సెలబ్రిటీల్లో ఆమెకూడా ఒకరని గూగుల్‌...

వైఎస్ జగన్ కు పవన్ కళ్యాణ్ హెచ్చరిక

ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌తో కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థులను కేసీఆర్...

ఒత్తిడికి లొంగుతున్న చంద్రబాబు, పవన్

చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మీడియా, సోషల్ మీడియా ఒత్తిడికి లొంగినట్లే కనబడుతోంది. ఆదివారం రాత్రి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో పవన్ మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీపై కాస్త విమర్శలు చేసినట్లు నటించారు. అదే విధంగా...
 Nate Gerry Jersey